పల్లవి
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని
చరణం 1
నేను అని లేను అని చెబితె ఏం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లె పొమంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ నీ కంటిమైమరుపులో నను పొల్చుకొంటాననీ తల ఆంచి నీ గుండెపై నా పేరు వింటాననీనీకు చెప్పాలని
చరణం 2
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదంనిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోననీప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలని
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment