Friday, November 16, 2007

Autograph (మౌనం గానే)

పల్లవి

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
చరనం 1
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగాభారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగాసాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది విసుగే చెందక కౄషి చేస్తేనే అమౄతమిచ్చింది అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటె సత్యమిది తలచుకొంటె సాధ్యమిది
చరనం 2
చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకోమార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకోపిడికిలీ బిగించగా చేతి గీత మార్చుకోమారిపోని కధలే లేవని గమనించుకోతొచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లొ గుదికట్టి స్వర్గాలె తరియించగానీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలిఅంతులేని చరితలకి ఆది నువ్వు కావలి

No comments: