పల్లవి
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడిమౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండిస్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటైదిక్కుల్లొ శూన్యమై శూన్యమై
చరణం 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగాఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదాపీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
చరణం 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగాభయమన్నదే పుట్టదాప్రతి ఊహతో పెరగదా పీల్చే గాలినైనా నడిచే నేలనైనా నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment