రచన సీతారామశాస్త్రి
గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం
గాలి లోనే మాటి మాటికీ వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో
రాతిరంతా చందమామతో లేని పోని ఊసులాడటం
యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో
ఒక్క సారి నిన్ను వాన వొల్లో ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహ లోన తడిసాను
ఒక్క సారి నిన్ను వాన వొల్లో ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే లేని ఊహ లోన తడిసాను
మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా
కునుకు రాని అర్ధ రాత్రిలో కళ్ళు తెరిచి కలవరించడం
యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో
మెరిసె మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటె
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై అలజడి ఎటున్నా రమ్మని
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ
దారి పోయె ప్రతి వారిలో నీ పోలికలే వెతుకుతుండటం
యెమయ్యిందో యేమితో నాకేమయ్యిందో యేమిటో
Friday, December 14, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment