Sunday, December 23, 2007

peddarikam(edele taratarala...)

రచన:భువనచంద్ర
గానం:ఎస్.జె.ఏసుదాసు
సంగీతం:రాజ్-కోటి

ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం!!2!!
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
చరణం1: ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినది ఆ ద్వేషము
కధమారదా ఈ బలి ఆగదా
మనిషె పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే
మనిషె పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే
అభము శుభము ఎరుగని వలపులు ఒడిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం!!2!!
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
చరణం2: విరిసి విరియని పూతొటలొ రగిలే మంటలు చల్లారవా ఆర్పేదెలా ఒదార్చేదెలా
నీరె నిప్పుగ మారితే వెలుగే చీకటి ఊదితే
నీరె నిప్పుగ మారితే వెలుగే చీకటి ఊదితే
పొగలో సెగలో మమతల పువ్వులు కలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం!!2!!
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం

No comments: