Sunday, December 23, 2007

chitram(oohala pallakulo)

గానం:నిశల్,ఉష
సంగీతం:పట్ననాయక్

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులు నింపనా రాచిలకై కిల కిలా నవ్వనా
నా పెదవుల మధువులె ఇవ్వనా సయ్యాటలోన ఊహల పల్లకీలో
ప్రేమలో తీపితింటే వయసే నీదిరా బ్రతుకులో చెదులున్న భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
విరి తానుగానె వచ్చి నిన్ను చేరునురా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా ఆకాశపుతంచులే వంచనా
ఆ జాబిలె కిందకె దించనా నా కన్నెకూనా ఊహల పల్లకీలో
ఆశగా పల్లవించె పాటే నీవులే జీవితం తోడులేని మోడే కాదులే
కలిసుండే వేళలో కలగంటు రాదులే వనవాసై పొదులే అడియాశే కాదులే
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే
మేఘాలకు నిచ్చెనే వేయనా ఆకాశపుతంచులె వంచనా
ఆ జాబిలె కిందకే దించనా నా కన్నెకూనా ఊహల పల్లకీలో

No comments: