Friday, December 14, 2007

seetaaraamayya gaari manuvaraalu సీతారామయ్య గారి మనువరాలు

సంగీతం కీరవాణి
రచన వేటూరి ??

పూసింది పూసింది పున్నాగ

పూసంత నవ్వింది నీలాగ

సందేళ లాగేసె సల్లంగ

దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై

ఆడ జతులాడ



ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా

అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ

కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే

కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే

అనుకోని రాగమే అనురాగ దీపమై

వలపన్న గానమే ఒక వాయు లీనమై

పాడె మది పాడె







పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా

కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా

అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే

ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై

పసి మొగ్గరేకులే పరువాల చూపులై

పూసె విరబూసె

No comments: