Friday, December 28, 2007

Aapadbaandhavudu(ouraa ammaka challaa ....)

గానం:ఎస్.పి.బాలు,చిత్ర
సంగీతం:ఎం.ఎం.కీరవాని

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ఔరా

నల్ల రాతి కండలతో కరుకైనవాడేవె
న్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలావెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల

పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల

No comments: