Tuesday, December 18, 2007

gaayam(alupannadi unda)

గానం: చిత్ర
సంగీతం:శ్రీ

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలుపులకు
లలా లలా లల.......
నాకొసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకై సిరులే పిలచి దాసోహమె అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవ నా కన్నులకు
లలా లలా లల......
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
నీచుపులే తడిపె వరకు ఎమయినదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఎడేడు లోకాలా ద్వారాల తలుపులు తెరిచే తరుణం కోరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లలా లలా లల.....
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలుపులకు
లలా లలా లల.......

No comments: