రచన:సీతరమశాస్త్రీ
గానం:ఎస్.పి.బాలు,చిత్ర
సంగీతం:ఇళయ రాజా
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం!!2!!
గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా!!తరలి రాద!!
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలిఅందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగంపదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద!!తరలి రాద!!
బ్రతుకున లేని శృతి కలదాయదసడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదాయదసడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...
ప్రజాధనం కానీ కళావిలాసంఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందాపాడే ఏనే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళపెదవిని విడి పలకదు కద
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment