రచన:సీతరమశాస్త్రి
నం:ఎస్.పి.బాలు
సంగీతం:ఎస్.ఎ.రాజ్ కూమర్
ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో, తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఎమో ప్రేమగుణం
ఏ క్షణాన ఎలాగమారునో ప్రేమించే హృదయం !!ఆలయాన!!
ఎండమావిలో ఎంతవెతికినా నీటిచెమ్మ దొరికేనా
గుండెబావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా..
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తుంది గగన ప్రయాణంఎ
దన ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగమారునో ప్రేమించే హృదయం !!ఆలయాన!!
సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కలకోసం
కళ్ళుమూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఎదేమైనా, పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగమారునో ప్రేమించే హృదయం !!ఆలయాన!!
Sunday, December 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment