రచన : సిరివెన్నెల
సంగీతం : అర్.పి.పట్నాయక్
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడొ ఏమో బ్రహ్మ..
పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెనుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా..
పాలకడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన యెదను మీటి నేలమ్మ పొంగెనమ్మా..ఆ ఆ ఆ ఆగని సంబరమా ఆ ఆ ఆ అగని సంబరమా..
వరములన్ని నిను వెంటబెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలా బొమ్మా..
సిరుల రాణిని చేయిబట్టి శ్రీహరిగమారునని రాసిబెట్టి ఏ వరుని జాతకం వేచివున్నదమ్మా..
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా..ఆ ఆ ఆ ఆమని సుమశరమా ఆ ఆ ఆ కాముని సుమశరమా..
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..
Saturday, January 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment