Monday, March 31, 2008

siri vennela sitarama sastri(eppudu vappukovadura...)

రచన:సీతరామశాస్త్రీ
ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకొవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మోప్ప ముందు చిన్నదేనురా..
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేదురా..
గుటక పడని అగ్గి వుండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా..
నిశావిశాలమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా..రగులుతున్న గుండె కూడా సూర్యగొళమంటిదేనురా..

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా..
నీరశించి నిలిచిపొతే నిమిషమైనా నీదికాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ..
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్నా సైన్యముండునా..
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధౌనురా..
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా..
ఆయువంటు వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవముపైనే గెలుపు చాటురా..

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

No comments: