గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
వ్రాసింది: ఆత్రేయ & అనిశెట్టి
నరుల జీవత పదమున నడుపువాడు
కాల్లు లేని అభాగ్యుడై కనలినేడు
స్నేహితుని గుండే శోకపు చితిగా మారే
ప్రణయ మూర్తికి బ్రతుకొక ప్రళయమాయే..
శాంతి సుఖములతేలెడు జీవితముల
చిచ్చుపెట్టుటే దైవవిలాసమేమో!!!!!!!!!
ఎవరికి వారవు స్వార్ధంలో
హౄదయాలరుదవు లోకంలో....
ఎవరికి వారవు స్వార్ధంలో
హృదయాలరుదవు లోకంలో....
నాకై వచ్చిన నా చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ...
ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే...
నా అను వారే లేరని నేను కన్నీరొలికే కాలంలో...
వున్నానని నా కన్నతల్లి వలే ఒడిని చేర్చి నన్నోదార్చావే!!
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..
ప్రేమకొరకు ప్రేమించేవారే కానరాక గాలించారు...
గుండెలు తెరచి వుంచాను గుడిలో దేవును అడిగాను..
గంటలు ఘన ఘన మ్రోగాయి నా కంటి పాప నువ్వన్నాయి....
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..
ఈ అనురాగం ఈ ఆనందం...
ఎవ్వరెరుగని ఈ అనుభందం...
ఓడలు పార్చి మేడలు పరచి వుండాలి వెయ్యేల్లు
చల్లగ వుడాలి వెయ్యేల్లు తీయగ పండాలీ మన కథలు.....
ఎవరికి వారవు స్వార్ధంలో
హృదయాలరుదవు లోకంలో....
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment