Wednesday, October 31, 2007

Gaayam(Niggadesi Adugu)

రచన: సిరివెన్నల సీతారామశాస్త్రి
సంగీతం: శ్రీ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి
యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్ఠం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం

Chakram(Jagamantha Kutumbam)

రచన: సిరివెన్నల సీతారామశాస్త్రి
గానం: శ్రీ
సంగీతం: చక్రి

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 1
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను సంగమిస్తు నాతో నేనె భ్రమిస్తు
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 2
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

చరణం 3
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

Happy-days(Ye cheekati)

గానం : రంజిత్ ,సునిత సరత్య
సంగీతం:మిక్కి జె.మేయర్



ఒ ఒ ఒహొ ఒ ఒ ఒహొ సైనరొ సైనరొ సైనరొ సైనరొ..

యే చికటి చెరిపేయని కలలే కన్నలి..

ఆ వేకువె దరి చెరగ నిజమె అవాలి..
ఈ చెలిమి సాక్షిగా కాలమె ఆగిపొని..
స్నేహలు తీరమె చెరువై రాని..
ఒ ఒ ఒహొ ఒ ఒ ఒహొ
కలలే కన్నలి..ఒ ఒహొ ఒ ఒ ఒహొ నిజమే అవలి..
పదే పదే ఆడుకొవలి..మదె ఇలా హాయిరాగమే..
ప్రతి క్షణం పాట మవ్వలి..అదె కద జీవితన రవలి...

సైనరొ సైనరొ సైనరొ సైనరొ...

కలతే పడకు..కల నిజమయ్యె వరకు ..
గెలుపే తుదకు పెరుగే లెదనుకొకు..
ఊరెగని... మన ఊహలే..ఆ తారలే తాకెలా...
ఒ ఒ ఒహొ ఒ ఒ ఒహొ కలలె కన్నలి..ఒ ఒ ఒహొ ఒ ఒ ఒహొ నిజమె అవాలి..
పదె పదె ఆడుకొవలి ..మదె ఇలా హాయిరాగమే ..
ప్రతి క్షణం పాఠమవ్వలి..అదె కద జీవితన రవలి..
ఓఒ ఒహొ ఓఒ ఒహొ..సైనరొ.. సైనరొ..

గతమె మరచి చెయ్యి కలిపెందుకు చూడు..
ఏదనే పరచి ప్రేమకు పల్లవి పాడు..
ఎ సంఖ్యల స్పందించని చిరుగాలిలా రావీలా..

యె చీకటి చెరిపేయని కలలె కన్నలి ..ఆ వేకువె దరి చెరగ నిజమె అవలి..
పదె పదె ఆడుకొవలి ..మదె ఇలా హాయిరాగమే ..ప్రతి క్షణం పాఠమవ్వలి..అదె కద జీవితన రవలి..
ఒ ఒ ఒ ఒ ఒ .................

Brathuku theruvu(andame-aanandam)

పాడినవారు : ఘంటసాల
రచన : సముద్రాల

అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం

పడమట సంథ్యరాగం కుడియెడమల కుసుమపరాగం
పడమట సంథ్యరాగం కుడియెడమల కుసుమపరాగం
ఓడిలో చెలి మోహనరాగం ఓడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగంజీవితమే మధురానురాగం
అందమె

పడిలేచె కడలితరంగం ఊ పడిలేచె కడలితరంగం
వడిలో జడసిన సారంగంపడిలేచె కడలితరంగం వడిలో జడసిన సారంగం
సుడిగాలిలో..
సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం
అందమె

adavari matalaku arthaley veruley(naa manasuki)

గానం:గాయత్రి,కార్తిక్
సంగీతం:యువన్ శంకర్
రచన:చంద్రబోస్

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చెసి
నిలిచవె ప్రేమను పంచి హొ హొ ....... 2
నా వయసుకి వంతెన వేసి నా వాలపుల వాకిలి తీసి
మదిగది తెరచి పకేపరచి వున్నవు లొకం మరిచి // నా //

నీ చూపుకు సుర్యుడు చలువయె
నీ స్పర్సకి చంద్రుదు చెమటయె
నీ చొరవకి నీ చెలిమికి
మొదలయె మయె మయె
నీ అడుగికి ఆకులు పూవ్వులయె
నీ కులుకుకి కాకులు కవులయె
నీ కలలకి నీ కదలకి
కదలడె హయె హయె
అందంగ నన్నె పొగిడి అటుపైన ఎదొ అడిగి నా మనసనె
ఒక సరస్సులొ అలజడులె స్రుష్టించవే //నా//

ఒక మాట ప్రేమగా పలకలే
ఒక అడుగు జత పడి నడవలే
ఆ గురుతులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సరి ఒడిలొ ఒదగలె
యెదపైన నిదరే పూవలి
తియ్య తియ్యని నీ స్మ్రుతులతొ
బ్రతికెస్త నిమిషం నిమిషం
నీ ఆశలు గమనిచలే నీ అత్రుత గుర్తించలె ఎటు తేలకా బదులియకా మౌనంగ చూస్తునలే న..న న..........

Monday, October 29, 2007

Rudra veena(lalita priya)

గానం:కె.జె.ఏసుదాసు,చిత్ర
సంగీతం:ఇలయరాజ
రచన:సీతరామశాస్త్రీ


లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హ్రుదయం కలల విరుల వనం మన హ్రుదయం వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను లలిత
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినదిమనసు హిమగిరిగా మారినది //2//
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ.......... లలిత

Sunday, October 28, 2007

Gudi gantalu everiki(1964) (narula jivatha)

గానం: ఘంటసాల
సంగీతం: ఘంటసాల
వ్రాసింది: ఆత్రేయ & అనిశెట్టి

నరుల జీవత పదమున నడుపువాడు
కాల్లు లేని అభాగ్యుడై కనలినేడు
స్నేహితుని గుండే శోకపు చితిగా మారే
ప్రణయ మూర్తికి బ్రతుకొక ప్రళయమాయే..
శాంతి సుఖములతేలెడు జీవితముల
చిచ్చుపెట్టుటే దైవవిలాసమేమో!!!!!!!!!

ఎవరికి వారవు స్వార్ధంలో
హౄదయాలరుదవు లోకంలో....
ఎవరికి వారవు స్వార్ధంలో
హృదయాలరుదవు లోకంలో....
నాకై వచ్చిన నా చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ...

ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే...
నా అను వారే లేరని నేను కన్నీరొలికే కాలంలో...
వున్నానని నా కన్నతల్లి వలే ఒడిని చేర్చి నన్నోదార్చావే!!
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..


ప్రేమకొరకు ప్రేమించేవారే కానరాక గాలించారు...
గుండెలు తెరచి వుంచాను గుడిలో దేవును అడిగాను..
గంటలు ఘన ఘన మ్రోగాయి నా కంటి పాప నువ్వన్నాయి....
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..

ఈ అనురాగం ఈ ఆనందం...
ఎవ్వరెరుగని ఈ అనుభందం...
ఓడలు పార్చి మేడలు పరచి వుండాలి వెయ్యేల్లు
చల్లగ వుడాలి వెయ్యేల్లు తీయగ పండాలీ మన కథలు.....

ఎవరికి వారవు స్వార్ధంలో
హృదయాలరుదవు లోకంలో....
నాకై వచ్చిన నచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివి ... నాకమృతం తెచ్చిన జాబిలివి..